Andhra PradeshHome Page Slider

కాలేజీలో సీక్రెట్ కెమెరాలపై వెలుగులోకి సంచలన నిజాలు

కృష్ణాజిల్లా గుడ్లవల్లూరు కాలేజీలో రహస్య కెమెరాలపై సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వారం రోజుల క్రితమే తాము ఆ కెమెరాలను కనిపెట్టామని విద్యార్థినులు వెల్లడిస్తున్నారు. దీనిపై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు. హాస్టల్ బాత్రూమ్‌లలో రహస్య కెమెరాలు పెట్టారని, విద్యార్థినుల 300 వరకూ వీడియోలను అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. విజయ్ అనే వ్యక్తి  ఈ కెమెరాలను పెట్టారనే అనుమానంతో దేహశుద్ధి చేశారు. అతనికి హాస్టల్ నుండే ఎవరో అమ్మాయి సహకారం ఉండి ఉండాలని, లేకపోతే ఇలాంటి చర్యలు సాధ్యం కావని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 4వ సంవత్సరం చదువుతున్న అమ్మాయి వీడియోలు తీయడం గమనించామని ఆమెను రూమ్‌లో బంధించి, యాజమాన్యం రక్షిస్తోందని వారు చెప్తున్నారు.  ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. జిల్లా మంత్రి కొల్లు రవీంద్రని, ఎస్పీని తక్షణమే కాలేజీకి వెళ్లాలని ఆదేశించారు. పోలీసులు ఈ ప్రదేశాలను తనిఖీ చేసి, ఎలాంటి కెమెరాలను గుర్తించలేదని, నిందితుల ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్స్ పరిశీలించామని తెలిపారు. తప్పు జరిగినట్లు తెలిసే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు.