BusinessHome Page SliderNews AlertTelangana

శ్రీచైతన్య సంస్థ ఐటీ సోదాల్లో వెలుగులోకి సంచలన విషయాలు..

శ్రీ చైతన్య విద్యాసంస్థలలో కొన్ని రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకూ ఈ విద్యాసంస్థలు ఇప్పటి వరకూ దాదాపు రూ.230 కోట్లు ట్యాక్స్ కట్టలేదని పేర్కొన్నారు. అలాగే పన్నుచెల్లింపులు జరపకుండా దేశవ్యాప్తంగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. చైతన్య యాజమాన్యం అక్రమాస్తులను పోగేసినట్లు కూడా గుర్తించారు. విద్యార్థుల నుండి నగదు రూపంలో వచ్చిన ఫీజులతో ఆస్థులు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. విద్యార్థుల నుండి డబ్బు వసూలు చేసేందుకు రెండు రకాల సాఫ్ట్‌వేర్‌లు రూపొందించారని, ఇలా పన్నులు చెల్లించకుండా ఎగ్గొట్టిన సొమ్ముతో అస్థులు కొనుగోలు చేశారని పేర్కొన్నారు.