NewsTelangana

మునుగోడు ఓటరు జాబితా పై హైకోర్టు సంచలన ఉత్తర్వులు

కీలక మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ లో ఉన్న ఓటరు జాబితాను తక్షణ నిలిపివేయాలని తేల్చి చెప్పింది. కేసు విచారణను ఈనెల 21 న హైకోర్టు వాయిదా వేసింది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని బీజేపీ ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేసింది. మునుగోడు నియోజకవర్గంలో 25వేల ఓట్లు పైచిలుకు అక్రమంగా నమోదు చేశారని ఆరోపించింది. పెండింగ్‌లో ఉన్న ఓటర్ జాబితాను నిలిపివేయాలని సూచించింది. 25 వేల ఓటర్లు నమోదవ్వగా , అందులో కేవలం 12 వేలు మాత్రమే నిర్దారించామని ఎన్నికల సంఘం తెలిపింది. మరో 7 వేల ఓట్ల నమోదును తిరస్కరించింది. పెండింగ్ ఉన్న ఓటర్ల ప్రక్రియ నిలిపివేయాలని కోరిన పిటిషనర్ వాదనలతో కోర్టు కూడా ఏకీభవించింది.