Andhra PradeshHome Page Slider

విశాఖ ఆర్‌ఐ స్వర్ణలత కస్టడీలో సంచలన విషయాలు

విశాఖ సిటీ పోలీస్ ఆర్‌ఐ స్వర్ణలతతో పాటు మరో ముగ్గురు నిందితులను 2 వేలనోట్ల మార్పిడి కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణలో భాగంగా ఆమెను కస్టడీలో తీసుకున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. తాను డబ్బుకు ఆశపడి, సినిమాలలో నటించాలనే ఉద్దేశమే తన కొంప ముంచిందని విచారించింది. డీసీపీ నాగన్న, ఏసీపీల, ఇన్‌స్పెక్టర్లు, మహిళా పోలీసుల అధ్వర్యంలో వీరిని విచారించారు. విశాఖలోని నేవీ అధికారులు 90 లక్షల వరకూ 2 వేల నోట్లు తెచ్చిన మాట నిజమేనని అంగీకరించింది. సినిమా షూటింగులలో ఏ 1  సూరి పరిచయమయ్యాడని తెలిపారు. అతడితో పాటు కానిస్టేబుల్, హోంగార్డులు ఒత్తిడి చేయడంతోనే ఈ నోట్ల మార్పిడి వ్యవహారంలో తలదూర్చినట్లు తెలిపింది.