ఢిల్లీ విమానాశ్రయం సంచలన నిర్ణయం..
ఢిల్లీ విమానాశ్రయం కేంద్రప్రభుత్వంపైనే దావా వేయాలని తీసుకున్న నిర్ణయం సంచలనం కలిగిస్తోంది. రక్షణ శాఖకు చెందిన విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతించడాన్ని ఈ దావాలో సవాల్ చేసింది జీఎంఆర్ సంస్థ. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల యాజమాన్యంలో జీఎంఆర్‌కు మెజారిటీ వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఘాజీయాబాద్ విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతిస్తే ఢిల్లీ విమానాశ్రయం ఆర్థికంగా నష్టపోతుందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల విమానాశ్రయాలలో ఢిల్లీ విమానాశ్రయం ఒకటి. ప్రభుత్వ రుసుములు పెరగడం వల్ల దాదాపు 21 మిలియన్ డాలర్లు నష్టపోయిందని జీఎంఆర్ సంస్థ ఈ దావాలో పేర్కొంది.