Home Page SliderNational

ఒడిశా రైలు ప్రమాదంపై బెంగాల్ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఒడిశాలో నిన్న రాత్రి జరిగిన రైలు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.  కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా సూమారు 1000 మందికి పైగా తీవ్ర గాయాలబారిన పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని ప్రముఖులతోపాటు దేశంలోని ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే దీనిపై బెంగల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.కాగా ఈ రైలు ప్రమాదం వెనుక కుట్ర జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు. కాబట్టి దీనిపై కేంద్రం సమగ్ర దర్యాప్తు చేపట్టాలన్నారు. ఈ ప్రమాదంలో రైల్వే అధికారుల లోపం స్పష్టంగా కన్పిస్తోందన్నారు. అయినప్పటికీ ఇది రాజకీయాలు చేసే సమయం కాదన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. బెంగాల్ తరుపున బాధితులకు న్యాయం అందిస్తామని సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.