డిప్యూటీ సీఎంపై సీనియర్ హీరోయిన్ ప్రశంసలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సీనియర్ హీరోయిన్ శ్రియ ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 100 శాతం విజయం సాధించడంపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శ్రియ పవన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ అద్భుతాన్ని సృష్టించారన్నారు. గతంలో తామిద్దరూ బాలు చిత్రంలో కలిసి నటించామని, ఆయన శ్రమపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని, చాలా సైలెంట్‌గా ఉంటారని పేర్కొన్నారు. బాలు చిత్ర షూటింగ్లో కాలికి గాయమయినా షూటింగ్ పూర్తయ్యేంతవరకూ ఎవ్వరికీ చెప్పలేదన్నారు. ప్రజలకు ఎప్పుడూ మంచి చేయాలనే తపన ఉన్నవారని, ఆయన డిప్యూటీ సీఎంగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

