ఆర్జీవీతో సినిమాపై సీనియర్ హీరోయిన్ వ్యాఖ్యలు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయవంతమైన చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందిన నటి ఊర్మిళ. అప్పట్లో అంతం, గాయం, రంగీలా, సత్య, భూత్ వంటి చిత్రాలలో నటించింది. వీరిద్దరిదీ హిట్ కాంబినేషన్‌గా చెప్పుకుంటారు. తర్వాత కాలంలో వీరిద్దరూ కలిసి సినిమా చేయకపోవడంపై ఇటీవల ఆమె స్పందించారు. మీరిద్దరికీ విభేదాలా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తూ అలాంటిదేం లేదని, గొప్ప దర్శకులలో ఆర్జీవీ ఒకరు అంటూ వ్యాఖ్యానించారు. అవకాశం వస్తే మళ్లీ ఆర్జీవీ, మనోజ్ బాజ్‌పాయ్‌లతో కలిసి నటిస్తానని పేర్కొన్నారు. సత్య చిత్రం రీరిలీజ్ సందర్భంగా ఆమె సంతోషం వ్యక్తం చేశారు.


 
							 
							