ఆసుపత్రిపాలయిన కాంగ్రెస్ సీనియర్ నేత
తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అస్వస్థతకు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు జానారెడ్డిని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. నిన్న మోకాలి చికిత్స కోసం జానారెడ్డిని యశోద ఆస్పత్రికి తరలించారు ఆయన కుటుంబసభ్యులు. ఈ క్రమంలో జానారెడ్డికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు గుండెలో రక్తనాళం పూడుకుపోయినట్లు గుర్తించారు. దీంతో నిన్న రాత్రి వైద్యులు ఆయనకు స్టంట్ వేశారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.