ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత
బీజేపీ సీనియర్ నేత అద్వానీకి తీవ్ర అస్వస్థతతో ఏర్పడడంతో ఆసుపత్రిలో చేరారు. ఆయన జూలై మొదటి వారంలోనే ఢిల్లీ అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. నెల వ్యవధిలోనే మరోసారి ఆరోగ్యం దెబ్బతినడంతో మరోసారి ఆసుపత్రిపాలయ్యారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం ఆయనను తరలించారు. ఆయనకు యూరాలజీ వైద్యులు వైద్యం చేస్తున్నారు. 96 ఏళ్ల పెద్దవయస్సు కావడంతో బీజేపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. బీజేపీ కురువృద్ధునిగా పేరుపొందిన అడ్వాణీకి ఈ ఏడాది కేంద్రప్రభుత్వం భారతరత్న బిరుదునిచ్చి సత్కరించిన సంగతి తెలిసిందే.