అన్నావర్సిటీ ఘటనపై సీనియర్ నటి కీలక వ్యాఖ్యలు
అన్నావర్సిటీలో విద్యార్థినిపై జరిగిన అత్యాచారం విషయంలో చెన్నై వ్యాప్తంగా తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని, నోరు మెదపట్లేదని బీజేపీ నాయకురాలు, సీనియర్ నటి ఖుష్బూ ప్రశ్నించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే రాజకీయాలు చేయకుండా ఖండించాలని, తాను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నప్పుడు తమిళనాడు నుండి వచ్చే ఫిర్యాదులే దారుణంగా ఉండేవన్నారు. అసలు డీఎంకే మహిళా విభాగం ఎక్కడుందని, కనిమొళి ఏమయ్యిందని ప్రశ్నించారు. ఈ ఘటనపై నిజాయితీగా దర్యాప్తు జరగాలన్నారు.

