సెక్రటేరియట్ ను సీజ్ చేయండి..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళుతున్న వేళ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని ఎల్ జీ ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్క ఫైల్స్, రికార్డ్స్ బయటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రతి రాష్ట్రంలో ఇలానే ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు.. పలు కీలక ఫైళ్లను మాయం చేయడం, తగలబెట్టడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ముందస్తుగా అప్రమత్తమైన ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సచివాలయాన్ని సీజ్ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు.

