Home Page SliderNational

‘మీ అందం చూసే ఆయన ఎంపీ సీటిచ్చారంటూ’  శివసేన ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

మహారాష్ట్రలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. శివసేన పార్టీ రెండుగా చీలిపోయినప్పటినుండి ఒక వర్గంపై మరో వర్గం ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేదిపై శిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె అందాన్ని చూసే రాజ్యసభలో ఎంపీగా ఆమెకు ఆదిత్య ఠాక్రే స్థానం కల్పించారని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రియాంక చతుర్వేది తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నేను ఎలా ఉన్నానో, ఎక్కడ ఉన్నానో మీరు చెప్పాల్సిన అవసరం లేదని, మహిళల గౌరవాన్ని కించపరచవద్దని హెచ్చరించారు. దీనిపై ఆదిత్య ఠాక్రే కూడా స్పందించారు. సంజయ్ శిర్సత్ వక్ర బుద్దితో ఆలోచిస్తున్నారని, ఇలాంటి వారు  రాజకీయాల్లో ఉండడానికి అర్హులు కారని మండిపడ్డారు. దీనికి సంజయ్ వివరణ ఇస్తూ, గతంలో మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే, ప్రియాంక గురించి తనతో ఇవే మాటలు అన్నారని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ప్రియాంక ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనలో చేరడం గురించి మాట్లాడినప్పుడు చంద్రకాంత్ ఇలా అన్నారంటూ వ్యాఖ్యానించారు.