Home Page SliderNational

‘సంక్రాంతికి కలుద్దాం’ క్రేజీ కాంబోతో..?

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న ప్రాజెక్టుల్లో విక్ట‌రీ వెంక‌టేష్, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రాబోతున్న మూవీ కూడా ఒక‌టి. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ‘ఎఫ్‌-2’, ‘ఎఫ్-3’ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రాబోతున్న మూడో చిత్రం ఖ‌చ్చితంగా హ్యాట్రిక్ విజ‌యాన్ని అందుకోవ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి సినీ స‌ర్కిల్స్‌లో ఓ క్రేజీ ఇన్ఫో విన‌బ‌డుతోంది. అనిల్ రావిపూడి, వెంక‌టేష్  కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమాకు ఓ ఆస‌క్తిక‌ర టైటిల్‌ను ఫిక్స్ చేయ‌బోతున్నార‌ట‌. పూర్తి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు ‘సంక్రాంతికి క‌లుద్దాం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయనున్నార‌ట‌. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యేలా ఈ టైటిల్ ఉంటుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌.

దీంతో వెంక‌టేష్ నుంచి మ‌రోసారి కుటుంబ క‌థా చిత్రం రాబోతుంద‌ని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ‌లు మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేయాల‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.