Home Page SliderInternational

‘రోబో డాగ్స్‌’తో ట్రంప్‌కు భద్రత

అమెరికా సీక్రెట్ ఏజెన్సీ కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటి వద్ద భారీ భద్రతను పెంచింది. రోబో డాగ్స్‌ను ఫ్లోరిడాలోని ఆయన ఇంటి వద్ద కాపలా ఉంచింది. ఈ రోబోలను రిమోట్‌తో ఆపరేట్ చేయవచ్చు. వీటిలో అధునాతనమైన టెక్నాలజీతో సెన్సార్లు ఉంటాయి. సర్వైలెన్స్ టెక్నాలజీతో ఈ డాగ్స్ సీక్రెట్ ఆపరేషన్లను కూడా చేపట్టగలవు. అధ్యక్ష ఎన్నికల ప్రచార సభలలో రెండుమార్లు ట్రంప్‌పై హత్యాప్రయత్నం జరగడంతో ఆయనకు భద్రత పెంచాలని సీక్రెట్ ఏజెన్సీ భావించింది. ఈ డాగ్స్‌పై ‘ఇవి పెట్స్ కాదు’ అనే వార్నింగ్ కూడా రాసిపెట్టారు.