Home Page SliderTelangana

సికింద్రాబాద్ అల్ఫా హోటల్‌కు జరిమానా

రెండు రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్‌పై ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ఇవాళ వెల్లడించారు. హోటల్‌లో ఆహార భద్రతా ప్రమాణాలు ఏమీ పాటించట్లేదని పేర్కొన్నారు. పాడైపోయిన (ఎక్స్‌పైర్) మటన్‌తో బిర్యానీ చేసినట్లు గుర్తించారు. ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారం (ఓవెన్‌లో) వేడిచేసి ఇస్తున్నట్లు తెలిపారు. నాసిరకం పనిముట్లతో పాటు కిచెన్ దుర్గంధంగా మారినట్లు చెప్పారు. డేట్, బ్యాచ్ నంబర్ లేకుండా బ్రెడ్, ఐస్‌క్రీమ్ తయారు చేస్తునట్లు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో హోటల్‌కు టాస్క్‌ఫోర్స్ నోటీసులు జారీ చేసింది. ఒక లక్ష రూపాయలు పెనాల్టీ వేసింది.