మూఢ విశ్వాసాలతోనే సెక్రటేరియట్‌ను కూల్చారు: ప్రధాని మోడీ
మహబూబాబాద్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు అంధ విశ్వాసాలు ఎక్కువని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. మూఢ విశ్వాసాలతో ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. అంధ విశ్వాసాలతోనే సచివాలయం కూల్చారన్నారు. అలాంటి సీఎం మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ సర్కార్ ఏర్పడబోతోందని.. బీఆర్ఎస్ అవినీతిపరులను జైలుకు పంపిస్తామని మోడీ అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాశనం చేశాయని విమర్శించారు. గతంలో కేసీఆర్ ఢిల్లీకి వచ్చి బీజేపీతో పొత్తుపెట్టుకుంటామని అడిగారని.. తన వారసుడిని సీఎంగా చేస్తే బీజేపీతో కలుస్తామన్నారని చెప్పారు. కేసీఆర్ విజ్ఞప్తిని ఒప్పుకోకపోవడంతో బీజేపీని తిట్టడం మొదలుపెట్టారని ప్రధాని మోడీ అన్నారు.