Home Page SliderPoliticsTelanganatelangana,

సీక్రెట్‌గా తెలంగాణ తల్లి విగ్రహం.. రేవంత్ రెడ్డి సూపర్ ప్లాన్

తెలంగాణ తల్లి విగ్రహాన్ని త్వరలో సచివాలయంలో ప్రతిష్టించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విగ్రహాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీక్రెట్‌గా తయారు చేయిస్తున్నారట. ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేయిస్తున్నారు. పెద్ద అంబర్ పేట చెరువు వద్ద ఒక శిల్పితో దీనిని తయారు చేయిస్తున్నారు. అప్పుడప్పుడు ఆయనే వెళ్లి చూసివస్తున్నారు. డిసెంబర్ 9న సచివాలయం వద్ద ఆవిష్కరించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విగ్రహం సగటు తెలంగాణ మహిళ రూపంలో ఉంటుందని, తెలంగాణ వ్యవసాయం, బతుకమ్మ, శ్రమజీవనం, పోరాటం వంటి సందేశాలన్నీ ఇచ్చే విధంగా ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ విగ్రహం కోసం ప్రత్యేక గేటును కూడా ఏర్పాటు చేయనున్నారు.