Home Page SliderPoliticsTelangana

మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్

తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలంతా మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి వివేక్‌ గౌడ్‌, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, బేతి సుభాష్‌ రెడ్డి ఎమ్మల్యేలు హాజరయ్యారు. ఇతర ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేయొద్దని మల్లారెడ్డి కలెక్టర్‌కు చెప్పాడని అసమ్మతి ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. తాము చేపట్టే పనులకు మంత్రి అడ్డుతగులుతున్నాడని ఆరోపిస్తున్నారు. కుత్బుల్లాపూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవిని తన మనిషికి ఇప్పించారని ఎమ్మెల్యే వివేక్‌ మండిపడ్డారు. మరోవైపు పార్లమెంట్‌లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు మైనంపల్లి సిద్ధమవుతున్నారని సమాచారం. తన కుమారుడికి ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.