Home Page SliderTelangana

TGEAPCET రెండవ విడత కౌన్సిలింగ్ ఫలితాలు

తెలంగాణలో ఇంజనీరింగ్ రెండవ విడత సీట్లు విడుదలయ్యాయి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరిగింది. రెండవ విడత సీట్లను అధికారిక వెబ్‌సైట్లలో ఉంచారు. రెండవ విడత సీట్లకు ఎంపికైన వారు ట్యూషన్ ఫీజు పేమెంట్ చేసి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్‌కు ఆగస్టు 1 నుండి 2 వ తేదీ వరకూ సమయం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కళాశాలలలో మొత్తం 86,509 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. వీటిలో ఇంకా 5,019 సీట్లు మిగిలిపోయినట్లు కన్వీనర్ శ్రీదేవసేన వెల్లడించారు. బీటెక్ సీట్లు పొందిన విద్యార్థులు చివరి విడత కౌన్సిలింగ్ అనంతరమే ఆయా కాలేజీలలో రిపోర్టు చేయాలని విద్యాశాఖ పేర్కొంది.  అయితే తుది విడత కౌన్సిలింగ్ ఆగస్టు 8 నుండి 10వరకూ జరగనుంది. ఫైనల్ సీట్ల ఎలాట్‌మెంట్ ఆగస్టు 13న విడుదల అవుతుంది. అనంతరం ఆగస్టు 16,17 తేదీలలో ఆయా కాలేజీలలో జాయినింగ్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుందని కన్వీనర్ వెల్లడించారు.