accidentHome Page SliderTelanganatelangana,

SLBC టన్నెల్‌లో మృతదేహాల ఆనవాళ్లను గుర్తించిన జాగిలాలు..

నాగర్ కర్నూల్ జిల్లా SLBC టన్నెల్ ప్రమాదం దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదం మిగిల్చింది. రెండు వారాలుగా వందలకొద్దీ నిపుణులు ఈ టన్నెల్‌లో చిక్కుకున్న8 మందిని కనిపెట్టలేకపోయారు. అయితే తాజాగా కేరళ నుండి తీసుకువచ్చిన శిక్షణ పొందిన జాగిలాలు మృతదేహాలను గుర్తించే పనిలో పురోగతి సాధించాయి. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్‌లో మనుషుల ఆనవాళ్లను కనిపెట్టి. ఈ ప్రాంతంలో హ్యూమన్ స్కిన్ కనిపెట్టారు. జాగ్రత్తగా మట్టి తొలగిస్తున్నారు. వారికి 6 అడుగుల లోతులో ఒక వ్యక్తి కుడి చేయి కనిపించింది. మృతదేహం చుట్టూ మరో ఆరడుగుల లోతున గొయ్యి తవ్వేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఆ ప్రదేశంలోనే మృతదేహాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.