Andhra PradeshHome Page Slider

సీప్లేన్ రైడ్‌ సక్సెస్..శ్రీశైలం చేరుకున్న సీఎం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీప్లేన్‌లో విజయవాడ నుండి శ్రీశైలానికి చేరుకున్నారు. నేడు తొలిసారిగా ఇలాంటి సీప్లేన్‌ను ఏపీలో ప్రారంభించారు ముఖ్యమంత్రి. సీప్లేన్ సహాయంతో నీటిలో కూడా టేకాఫ్, ల్యాండింగ్ చేయవచ్చు. విజయవాడ పున్నమి ఘాట్‌ నుండి శ్రీశైలం వరకూ కేవలం అరగంటలో చేరుకుంది ఈ వాహనం. ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. ఈ సీప్లేన్‌ను మరికొన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తామని సీఎం వివరించారు.