Home Page SliderTelangana

పూరీ తీరంలో సీఎం రేవంత్ సైకత శిల్పం

ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు తమదైన స్టైల్ లో విషెస్ చెబుతున్నారు. తాజాగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్.. ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు. వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.