గురువారం నుండి గ్రూప్-4 సర్టిఫికెట్ల పరిశీలన
టిజి: గ్రూప్-4లో ప్రతిభ కనబరిచిన.. వినికిడి లోపం ఉన్న అభ్యర్థులు ఈ నెల 11 నుండి సెప్టెంబర్ 4 వరకు హైదరాబాద్ కోఠిలోని ఈఎన్టి ఆస్పత్రిలో మెడికల్ బోర్డు ఎదుట హాజరై సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని టిజిపిఎస్సి తెలిపింది. గ్రూప్-4 హాల్‌టిక్కెట్, మూడు పాస్‌పోర్టుసైజ్ ఫొటోలు, పాత సర్టిఫికెట్లను తీసుకురావాలని, పూర్తి వివరాలకోసం కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.