నా కారుపైనే గీతలు గీస్తారా? చిన్న పిల్లలపై పోలీస్ కేసు..
తన కారుపై గీతలు గీశారంటూ ఓ కానిస్టేబుల్ ఆవేశంతో ఊగిపోయాడు. దీంతో ఆయన ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హనుమకొండ పట్టణం రాంనగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో సీఐడీ విభాగంలో పని చేసే కానిస్టేబుల్ నివాసం ఉంటున్నాడు. ఇటీవల పార్కింగ్ లో చిన్నారులు ఆడుకుంటుండగా కానిస్టేబుల్ కారుపై గీతలు పడ్డాయి. దీంతో ఆగ్రహించిన అతడు తన కారుకు గీతలు పెట్టారని చిన్నారులపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వారి తల్లిదండ్రులు రిపేరుకు కోసం డబ్బులు ఇస్తామన్నా అతడు వినిపించుకోలేదు. ఈ క్రమంలో తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్ కు పిలవడంతో కేసు నమోదైన విషయం తెలిసింది. 2 నుంచి 9 ఏళ్లలోపు వయసున్న చిన్నపిల్లలపై కేసు నమోదు చేయడమేంటని తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు.