ఏపీలో ఈనెల 5న స్కూల్స్ బంద్
ఈ నెల 5న ఏపీవ్యాప్తంగా ఉన్న పాఠశాలల బంద్‌కు ABVP పిలుపునిచ్చింది. ప్రైవేటు ,కార్పోరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తున్నట్లు ABVP ప్రకటించింది. అంతేకాకుండా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొరతగా ఉన్న టీచర్ల నియామకం కూడా చేపట్టాలని ABVP డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 5న చేపట్టే బంద్‌ను విజయవంతం చేయాలని ABVP ఏపీలోని అన్ని ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలలకు పిలుపునిచ్చింది.

