స్కూల్ హెడ్ మాస్టార్ లంచావతారం
ఏసీబీ వలలో స్కూల్ హెడ్ మాస్టార్ చిక్కాడు. కాంట్రాక్టు టీచర్ జీతం రిలీజ్ చేసేందుకు బాధితురాలి దగ్గర లంచం తీసుకుంటూ స్కూల్ హెడ్ మాస్టార్ కృష్ణ ఏసీబీకీ పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ లో చోటు చేసుకుంది. కాంట్రాక్టు టీచర్ సంధ్యరాణి జీతం రిలీజ్ చేసేందుకు ప్రిన్సిపల్ రూ.10 వేల డిమాండ్ చేశారు. మొదట రూ. 2 వేల తరువాత నెలలో మిగితా డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించిన బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఇవాళ పొద్దున్న స్కూల్ ఛాంబర్ లోనే బాధిత టీచర్నుంచి రూ. 2 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

