మాజెండా మోసేవాడికే, ఓట్లు వేసేవారికే పథకాలు…తస్మాస్ జాగ్రత్త
కులం చూడం.. పార్టీ చూడం కేవలం అర్హత ఆధారంగా పథకాలు అందిస్తాం అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ వాస్తవంలో జరిగే పరిస్థితులు వేరు. సాక్షాత్తూ దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్వయంగా బెదిరింపులకు దిగుతున్నారు. మాజెండా మోసేవాడికే, ఓట్లు వేసేవారికే పథకాలు…తస్మాస్ జాగ్రత్త అంటూ బెదిరింపులకు దిగుతున్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. ఓటేస్తే ఓకే.. లేదంటే అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారు పథకాలు ,పర్మిషన్లు రావు అంటున్నారు. కల్వకుంట్ల పాలనలో తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు ఆగమాగం అవుతున్నాయి. నిరుపేదలకు అందివ్వాల్సిన పథకాలను నీరుగారుస్తున్నారు. ఇదేం బెదిరింపులంటూ నివ్వెరపోతున్నారు సామాన్యులు.

పార్టీలతో సంబంధం లేకుండా, కులమతాలు చూడకుండా అర్హత ఉంటే చాలు పథకాలు అందిస్తాం అంటూ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు అందివ్వాల్సిన పథకాలను అందిస్తుంటే తెలంగాణలో మాత్రం అధికార పార్టీకి కొమ్ముగాస్తూ ఎమ్మెల్యేలు బరితెగిస్తున్నారు. తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ దురాగతాలకు ఇంతకంటే నిదర్శనమేం కావాలి. పథకాలు రావేమో అంటూ భయపడే బడుగు జీవులను బెదిరిస్తూ, డబ్బు ఆశ చూపిస్తూ గెలిచే ఇలాంటి మహా నాయకులు గెలిచాక ప్రజాసంక్షేమం కోసం ఆలోచిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది.


 
							 
							