రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 10 రాష్ట్రాలకు చెందిన మొత్తం 37 మంది సభ్యుల పదవీ కాలం ముగియనుండటంతో, ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు ఈసీ కసరత్తు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 26న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా, మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 9న ఉపసంహరణకు అవకాశం కల్పించారు. తర్వాత మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి మరియు కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ సింఘ్వీ పదవీ కాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. దీంతో ఈ రెండు స్థానాలను భర్తీ చేసేందుకు షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతమున్న బలాబలాల దృష్ట్యా ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. కేవలం తెలంగాణలోనే కాకుండా మహారాష్ట్ర (7), తమిళనాడు (6), పశ్చిమ బెంగాల్ (5), బీహార్ (5), ఒడిశా

