ఫిబ్రవరిలో షెడ్యూల్.. మార్చిలో ఎన్నికలు: కిషన్‌రెడ్డి
తెలంగాణ: ఫిబ్రవరి చివరిలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. మార్చిలో పార్లమెంట్ ఎన్నికలు ఉండొచ్చు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు అమిత్ షానే ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు. ఒక్కో అగ్రనేత ఒక్కో రాష్ట్రాన్ని పర్యవేక్షిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసేందుకు పార్టీ తరఫున ఆశావహుల నుండి దరఖాస్తులు తీసుకోం అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.