హెటెరోపై సీబీఐ కేసు కొట్టివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో గ్రూపు సంస్థలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హెటిరో సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసును కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అయితే, నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు… హెటెరోపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేసేందుకు నిరాకరించింది. హెటెరో కంపెనీ విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.
ఈ కేసులో ఇప్పటికే హెటిరో గ్రూప్ క్వాస్ పిటిషన్‌ను, సీబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో ఆ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హెటిరో పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ జోసెఫ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.

