ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంలో ఊరట
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్ ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ నిబంధనలను ట్రయల్ కోర్టు నిర్దేశిస్తుందని సుప్రీం పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ అనంతబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మే 23 నుంచి ఆయన రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉన్నారు.

