Home Page SliderNational

‘సత్యం సుందరం’ – దర్శకుడు ప్రేమ్‌కుమార్

కార్తీ, అరవింద్‌ స్వామి ప్రధాన తారాగణంగా యాక్ట్ చేసిన ‘సత్యం సుందరం’ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘96’ ఫేమ్‌ ప్రేమ్‌కుమార్‌ డైరెక్షన్ చేశారు. సూర్య, జ్యోతిక నిర్మాతలు. తెలుగులో ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ సినిమా గురించి విశేషాలు తెలియజేస్తూ ‘ఇదొక అందమైన ఫ్యామిలీ డ్రామా. ఒక్క రాత్రిలో కథ జరుగుతుంది. కార్తీ, అరవింద్‌ స్వామి మధ్య ఉన్న అనుబంధం ఏమిటి? వారి మధ్య ఎలాంటి మానసిక సంఘర్షణ చోటుచేసుకుంది అనే అంశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి’ అన్నారు.

ఈ కథను తొలుత నవలగా రాశానని, ఆ తర్వాత సినిమా ఫార్మాట్‌లో స్క్రిప్ట్‌గా తీర్చిదిద్దానని ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. ‘కార్తీ, అరవింద్‌స్వామి నవలను చదివారు. వారికి ఎంతగానో నచ్చింది. ఆ తర్వాత స్క్రిప్ట్‌ విని చాలా సంతోషించారు. ఇద్దరూ అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌ కనబరిచారు. గోవింద వసంత సంగీతం సినిమాకు ప్రధాన ఎస్సెట్ అని చెప్పుకోవాలి. సినిమాటోగ్రఫీ, విజువల్స్‌ మరో స్థాయిలో ఉంటాయి. తెలుగు వెర్షన్‌ డబ్బింగ్‌ బాగా వచ్చింది. స్ట్రెయిట్‌ తెలుగు సినిమాను చూస్తున్న అనుభూతి కలుగుతుంది’ 100 శాతం అనువాద చిత్రంగా అనిపించని అన్నారు.