డిసెంబర్ లో సర్పంచ్ ఎన్నికలు
ఈ డిసెంబర్ లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సంక్రాంతి నాటికి కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతాయని చెప్పారు. కొత్త సర్పంచుల హయాంలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 12,991 పంచాయతీలకు సర్పంచులు, వార్డు మెంబర్లను ఎన్నుకోనున్నారు.

