రూ.40 వేల కోట్ల ఆస్తిని వదులుకుని సన్యాసం
పూర్వకాలంలో సిద్ధార్థుడు రాజరిక సౌఖ్యాలు వదులుకుని భిక్షువుగా మారి గౌతమబుద్దునిగా మారిన కథ మనకు తెలిసిందే. కానీ ప్రస్తుత కాలంలో కూడా అలాంటివాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. మలేషియాకు చెందిన వెన్ అజాన్ సిరిపన్నోదీ అనే కుబేరుడు తన 500 కోట్ల డాలర్ల (రూ. 42 వేల కోట్లు) వ్యాపార సామ్రాజ్యాన్ని వదులుకుని 18 ఏళ్ల వయసులోనే బౌద్ధ భిక్షువుగా మారిపోయారు. ఆయన తండ్రి ఆనంద కృష్ణన్ మలేషియాలో ధనవంతులలో 3వ స్థానంలో ఉన్నారు. టెలికాం, శాటిలైట్స్, మీడియా, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాలలో ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. అంత ఆస్తిని, వ్యాపారాలను వదులుకుని బౌద్ధం వైపు ఆకర్షించబడడం చాలా విశేషం.

