Home Page Slider

బాలయ్య సినిమాతో సంక్రాంతి సెలబ్రేషన్స్ షురూ

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు బాలయ్య సినిమాతో ఊపందుకున్నాయి. బాలకృష్ణ హీరోగా,శ్రుతి హాసన్ హీరోయిన్‌గా, గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన చిత్రం వీరసింహ రెడ్డి . సంక్రాంతి కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరో కోసం చలిని సైతం లెక్క చేయకుండా అభిమానులు ఈ రోజు తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద బారులు తీరారు.

థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలభిషేకాలు చేస్తూ,టపాసులు కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. అంతేకాకుండా థియేటర్లలలో సైతం సినిమా మొదలయ్యినప్పటి నుంచి ఈలలు వేస్తూ,పేపర్లు ఎగురవేస్తూ సందడి చేశారు. దీంతో ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు బాలయ్య కూడా అభిమానులతో కలిసి సినిమాని వీక్షించారు. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో బాలయ్య,దర్శకుడు గోపిచంద్ మలినేని సందడి చేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసిన తర్వాత వీరిద్దరు అభిమానులతో కాసేపు ముచ్చటించారు.