బండి బహిరంగ సభ ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు
భైంసాలోని బీజేపీ బహిరంగ సభను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ సభాస్థలిని ఆధీనంలోకి తీసుకున్నారు. సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిన నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. సభా ప్రాంగణంలోకి ఎవరూ రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు సభ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసుకొంది. వాస్తవానికి ఇప్పటికే సభ మొదలు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రావాల్సి ఉంది. బహిరంగ సభ తర్వాత రోజుకు 15 కిలో మీటర్లు యాత్ర చేయాలని సంజయ్ నిర్ణయించారు. సభకు అనుమతి లేనందున పోలీసులు బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. నిర్మల్ బీజేపీ అధ్యక్షురాలు రమాదేవిని అరెస్టు చేశారు. పోలీసులు కావాలనే సభకు అనుమతివ్వడం లేదని బీజేపీ నేతలు ఆక్షేపించారు.


