Home Page SliderTelangana

హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సానియా మీర్జా?

తెలంగాణ: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో దిగనున్నట్లు సమాచారం. సానియా మీర్జా లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న అభ్యర్థి పోటీచేస్తే తప్పకుండా ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై ఆ పార్టీ నేతలు సానియాతో చర్చలు జరిపారట. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.