Home Page SliderInternationalSports

దుబాయ్‌లో సానియాకు గొప్ప గౌరవం..

దుబాయ్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు గొప్ప గౌరవం దక్కింది. ఆమెను తమ స్పోర్ట్స్ అంబాసిడర్‌గా నియమించినట్లు దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ పేర్కొంది. ఆమె గత కొన్నేళ్లుగా కుమారుడు ఇజహాన్‌తో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఆమె అక్కడ టెన్నిస్ అకాడమీ పెట్టి క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు. పాకిస్థాన్‌ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకుని, విడాకులు పొందిన సంగతి తెలిసిందే. అనంతరం కొన్ని కారణాల రీత్యా దుబాయిలో సెటిల్ అయ్యారు సానియా మీర్జా. ఆమెకు ఈ గౌరవం దక్కడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.