Andhra PradeshHome Page Slider

పోలీసుల గుప్పిట్లో సామర్లకోట

సామర్లకోట, కొత్తపల్లి: సామర్లకోట పట్టణం పోలీసు గుప్పిట్లో చిక్కుకుంది. గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు అన్నివైపులా మోహరించారు. అత్యంత భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. స్థానిక జగనన్న కాలనీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి పోలీసు బృందాలు చేరుకున్నాయి. నగరంలో అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజల రాకపోకలపై పలు ఆంక్షలు విధించడంతో పట్టణవాసుల సంచారానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సీబీఎం, బ్రౌన్‌పేట సెంటర్, టీటీడీసీ, ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం వంటి ప్రాంతాల్లో 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.