NewsNews AlertTelangana

సమర భేరీకి లక్షమంది పైమాటే..

మునుగోడు సభకు లక్ష మందికి పైగా హాజరయ్యేట్లు బీజేపీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ముఖ్య నేతలంతా మునుగోడులో మకాం చేసి .. సభా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన సభా వేదికకు పక్కనే రెండు వైపులా మరో రెండు వేదికలను ఏర్పాటు చేశారు. ఒక వేదికపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన ముఖ్య నేతలంతా ఆశీనులవుతారు. అలాగే సాంస్కృతిక బృందాల కళా ప్రదర్శనల కోసం మరొక వేదకను వినియోగించబోతున్నారు. ఎంతటి వర్షం వచ్చినా తట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రాంగణం అంతటా జర్మన్ టెక్నాలజీ టెంట్లను వినియోగించారు. సభకు భద్రత కోసం తెలంగాణ పోలీసులు దాదాపు 1300 మంది పోలీసులను రంగంలోకి దింపింది. మునుగోడులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కన హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ ల్యాండ్ అయ్యాక రోడ్డు మార్గంలో అమిత్ షా సభాస్ధలికి చేరుకుంటారు.  

Read more: రైతులను దగా చేస్తున్న కేసీఆర్