Home Page SliderInternational

‘బాలి’ బీచ్‌లో సమంత ఫొటోలు వైరల్

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత తన ఫొటోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులను కుషీ చేస్తోంది. ప్రస్తుతం బాలి బీచ్‌లో స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్న సమంత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక సంవత్సరం పాటు సినిమా షూటింగ్‌లకు గ్యాప్ ఇచ్చినట్లు ప్రకటించిన సమంత, తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటోంది. కొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతూ కఠిన సమస్యలను ఎదుర్కొంది. ఇప్పుడు జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటోంది. బాలిలో బీచ్‌లో తిరుగుతూ తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఎంతో సంతోషంగా ఉందంటూ కామెంట్లు పెట్టింది. ఫ్యాన్స్ అందరూ సమంత పోస్ట్‌లను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.