సమంతకు ఏడాది గ్యాప్ ఎందుకో క్లారిటీ ఇచ్చిన హెయిర్ స్టైలిస్ట్
హీరోయిన్ సమంత సినిమాలకు ఏడాది గ్యాప్ తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమె హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ భట్కర్ క్లారిటీ ఇచ్చారు. సమంత మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం విదేశాలకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఆమె సమయాన్ని పూర్తిగా ఆరోగ్యంపై కేటాయించాలని నిర్ణయించుకుందని, పూర్తి ఆరోగ్యంతో ఉత్సాహంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఆమెతో దిగిన ఫొటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి సమంత సమాధానమిస్తూ ఎమోజీలతో కృతజ్ఞతలు తెలిపింది.

కాగా సమంత కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధితో చాలా అస్వస్తతకు గురయ్యింది. చికిత్స తీసుకుంటూనే శాకుంతలం, ఖుషి చిత్రాల షూటింగులలో పాల్గొంది. ఇటీవలే ఖుషి, సిటాడెల్ వెబ్ సిరీస్‌ల షూటింగ్ అతికష్టంపై ముగించుకుని వచ్చింది. చేతినిండా ప్రాజెక్టులు ఉండడంతో పూర్తిగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకుని, చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి ఈ ప్రాజెక్టులలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. అందుకే షూటింగులకు ఒక సంవత్సరం విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు సమంత.

