NewsTrending Today

కొత్త జీవితంపై  సమంత ఇచ్చిన సమాధానం

సినిమా హీరో, హీరోయిన్ల వ్యక్తిగత జీవితం గురించి అందరికీ ఆసక్తే. వారి వివాహం, విడాకులు, రిలేషన్ షిప్, మళ్లీ పెళ్లి వంటి విషయాల గురించి ఆసక్తిగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సమంత తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన నటి. అక్కినేని ఇంటి కోడలిగా ఆమెను ఎంతో ఆదరించిన ప్రేక్షకులు, నాగచైతన్యతో విడాకుల అనంతరం అంతకంటే ఎక్కువే ట్రోల్స్ చేశారు. ఈ విమర్శలకు తోడు ఆమె మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి ఈమధ్యనే కోలుకుంది. ఇప్పుడు ‘శాకుంతలం’ చిత్ర ప్రమోషన్లతో చాలా బిజీగా ఉంది సమంత. అమెను ‘మళ్లీ ప్రేమలో పడొచ్చుగా’ అంటూ ప్రశ్నించిందో నెటిజన్. దీనికి సమంత ఇచ్చిన సమాధానాన్ని నెటిజన్లు ఎంతో మెచ్చుకుంటున్నారు. ఎవరినీ నొప్పించకుండా ‘ మీరు ప్రేమించినంతగా ఇంకెవరు ప్రేమించగలరంటూ’ లవ్ సింబల్‌ని జత చేస్తూ తెలివిగా సమాధానమిచ్చింది.