Home Page SlidermoviesNational

హాలిడే మూడ్‌లో సమంత

ఒక్కొక్కసారి బిజీ లైఫ్‌లోని పరుగులు ఆపి, కాస్త రిలాక్స్ అయితే బాగుండనిపిస్తుంది. సెలబ్రెటీలు కూడా అందుకు మినహాయింపు కాదు. తాజాగా హీరోయిన్ సమంత హాలిడే మూడ్‌లో వెళ్లిపోయింది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా పని నుండి విరామం తీసుకుని, విశ్రాంతి తీసుకుంటోంది. ఒక్కొక్కసారి ఎలాంటి ప్లాన్స్ వేయకుండా ఖాళీగా కూర్చోవడం కూడా మంచి ప్లానే అంటూ ప్రకృతిని, తను హాయిగా నిద్రిస్తున్న ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. గతేడాది ఖుషీ, శాకుంతలం సినిమాలతో యావరేజ్ హిట్ అందుకున్న సమంత ఈ సంవత్సరం సిటాడెల్ హనీ బన్నీతో సందడి చేసింది.