పెళ్లికూతురి గెటప్‌లో సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్తగా పెళ్లికూతురి గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సమంత, విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషీ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీనిలో చివరి షెడ్యూల్‌ను తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ సమీపంలో ద్రాక్షారామ పరిసరాలలో చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ సెట్స్ నుండి సెల్ఫీలు తీసుకుని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ ఫోటోలలో మెడలో నల్లపూసలతో పెళ్లికూతురిగా కనిపిస్తోంది. అంతేకాదు విజయ్ కూడా వీడియో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో సమంత ముస్లిం యువతిగా కనిపిస్తుందని, ఇప్పటికే విడుదలైన ‘నారోజా నువ్వే’ పాట ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

