సమంతకు స్వల్పంగా కరోనా లక్షణాలు
గత కొంతకాలంగా వరుస షూటింగులు, ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంతకు స్వల్ప అనారోగ్యం కలిగింది. తాను జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నానని ట్వీట్ చేసింది. అందువల్ల ఈ రోజు సాయంత్రం ఎంఎల్‌ఆర్‌ఐటీలో జరగనున్న శాకుంతలం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నానని వెల్లడించింది. మన టీమ్‌ను మిస్ అవుతున్నానని సారీ చెప్పింది. సమంత లీడ్ రోల్‌లో నటించిన శాకుంతలం చిత్రం ఈ నెల 14న రిలీజ్ కాబోతోంది. గత కొన్ని నెలలు మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సమంత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. తిరిగి రెట్టించిన ఉత్సాహంతో చురుకుగా షూటింగులలో పాల్గొంటోంది. శాకుంతలం చిత్ర ప్రమోషన్లలోనూ, ఖుషి, సిటాడెల్ సినిమాల షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు.

