ఏపీలో సమంతకు అభిమాని బర్తడే గిఫ్ట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు అభిమానులు ఎక్కువే. తెలుగు ప్రేక్షకులకు అభిమానం ఎక్కువైతే గుడి కట్టేయడం కూడా కామనే. ఇలాగే 2023లో సమంతాకు ఏపీలోని బాపట్లలో గుడి కట్టాడు సందీప్ అనే అభిమాని. నేడు సమంత పుట్టినరోజు సందర్భంగా మరో గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే ఆ గుడిలో పాత విగ్రహం పక్కనే బంగారు రంగులో మరో సమంత విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ప్రత్యేక పూజలు చేసి, కేక్ కూడా కట్ చేశాడు. పలువురు అనాథ పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేశాడు. ఆమె చేసిన మంచిపనులు చూసే, ఆమెకు అభిమానినయ్యానని పేర్కొన్నాడు. ఆమె వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం విషయంలో కొన్నిసార్లు బాధపడ్డానని, కానీ ఆమె ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించిందని పేర్కొన్నాడు.