National

స్టార్ హీరోలే అసూయపడేంత రేంజ్‌లో సమంత క్రేజ్

మనసర్కార్

‘ఏమాయచేసావే’ సినిమాతో తొలి అడుగు వేసిన సమంత నిజంగానే తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులను మాయ చేసేసింది. వ్యక్తిగత జీవితంలో విడాకుల వల్ల ఎదురుదెబ్బ తిన్నా, కెరీర్లో రాకెట్‌లా దూసుకుపోతోంది. వరుసగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో బిజీగా ఉంటోంది. తాజాగా సమంత నటించిన ‘యశోద’ సినిమా టీజర్ సూపర్  హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది. ఈ మూవీ అన్ని ప్రధాన భాషల్లో నవంబరు 11న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి హరి,హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే ఏకంగా 8 కోట్ల రూపాయల లాభం వచ్చిందట. అప్పుడే ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌కు మంచి డిమాండ్ వచ్చేసిందట. దీనితో నిర్మాతలు చాలా ఖుషీ అవుతున్నారు. అయితే రిలీజ్‌కు ముందే సమంత సినిమాకు అంత లాభాలా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొందరు హీరోలు సైతం చాలా అసూయపడుతున్నారట. క్రైమ్ స్టోరీగా, సైకలాజికల్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీపై ఈ మూవీ టీమ్‌కు మంచి అంచనాలు ఉన్నాయి. మంచి కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నారు. సమంత మాత్రం జోరుగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఆమె నటించిన ది ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. మరొక వెబ్ సిరీస్‌ను వరుణ్ ధావన్ హీరోగా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక ఆమె ఇతర సినిమాల విషయానికి వస్తే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ శాకుంతలం. దీనిని నీలిమాగుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో శకుంతలగా సమంత, దుష్యంతునిగా దేవ్ మోహన్ రాజు నటిస్తున్నారు. సమంత లుక్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది. దీనిని 3డిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తికాలేదని తెలిపింది చిత్రబృందం. ఈ సినిమాను కూడా తమిళ్, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. పుష్పలో ఐటమ్ సాంగ్ కూడా సమంతకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం సమంత హైదరాబాద్ కంటే ముంబైలోనే ఎక్కువగా  ఉంటూ రకరకాల షోల్లో పాల్గొంటున్నారు.