లండన్ థియేటర్‌లో సందడి చేసిన సమంత, ప్రియాంక
భారత్ స్టార్ హీరోయిన్లు సమంత, ప్రియాంక చోప్రాలు లండన్‌లోని ఓ థియేటర్‌లో సందడి చేశారు. హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రీమియర్ షో లండన్ థియేటర్‌లో ప్రదర్శించగా, ఈ సిరీస్‌లో నటించిన ప్రియాంక, సమంతలు వీక్షించారు. వారు ఇతర యూనిట్ సభ్యులతో కలిసి నవ్వుతూ సమయాన్ని గడిపారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ వెబ్ సిరీస్‌ను ఇండియన్ వెర్షన్‌లో కూడా హనీ-బన్నీ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీనిని నవంబర్ 7 నుండి అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం చేయనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో సమంతకు జంటగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించారు.
